![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ - 36 లో.. సీతాకాంత్ బారినుండి తన తండ్రిని కాపాడుకోవడానికి రామలక్ష్మి తన ఫ్యామిలీని తీసుకొని వేరొక ఊరికి వెళ్తుంది. ఆ తర్వాత వేరొక ఇంట్లో సామాను సర్దుతుంటారు. ధన డల్ గా ఉండడం చూసి ఇక నువ్వు నీ ప్రేమని మర్చిపోవాలి ప్రాణంగా ప్రేమించే అమ్మాయితో బతకాలని అనుకోవాలి కానీ అమ్మాయి తెచ్చే విలాసాలతో బ్రతకాలని అనుకోకూడదని ధనకి రామలక్ష్మి చెప్తుంది.
ఇక వాళ్ళు ఇక్కడికి రారు కదా.. ఇంత దూరం వచ్చినా కూడా నాకు ఇంకా భయంగా ఉందని సుజాత అంటుంది. నువ్వు భయపడకు నాన్నని మనం ఎలాగైనా కాపాడుకోవాలని రామలక్ష్మి అంటుంది. కానీ మాణిక్యం మాటల్లో తప్పు చేసిన ఫీలింగ్ లేకపోవడంతో రామలక్ష్మికి కోపం వస్తుంది. అసలు తప్పు చేసినప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటాం కానీ ప్రశాంతంగా మాత్రం ఉండలేమని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు నేను భయపడుతున్న ఈ భయాన్ని పోగొట్టి వాళ్ళని భయపెట్టే అవకాశం వస్తుందని మాణిక్యం అనుకుంటాడు. మరోవైపు సిరిని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు. ఎవరి కోసమో ఇలాంటివి చేయకు.. సిరి అంటే మన ఫ్యామిలీ మొత్తమని సిరికి సీతాకాంత్ చెప్తాడు. సిరిని జాగ్రత్తగా చూసుకోమని సీతాకాంత్ శ్రీవల్లికి చెప్తాడు.
ఆ తర్వాత శ్రీలత టెన్షన్ పడుతుంటే.. సందీప్ వచ్చి ఇప్పుడు సిరి బానే ఉంది కదా ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. సిరి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పగానే సందీప్ షాక్ అవుతాడు. ఆ తర్వాత అబార్షన్ చేయండి అని డాక్టర్ తో శ్రీలత అన్న విషయం గుర్తుకుచేసుకుంటుంది. ఇప్పుడు అబార్షన్ చేస్తే సిరి ప్రాణాలకే ప్రాబ్లమ్ అని డాక్టర్ అన్న విషయం సందీప్ కి శ్రీలత చెప్తుంది. ఏం చెయ్యలేని పరిస్థితి అని ఇద్దరు అనుకుంటారు. వాళ్ళ మాటలు సిరి వింటుంది. ధనకి ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయడు. వాళ్ళ పరువు కోసం నన్ను చంపడానికైనా వెనకాడరు. ఈ ప్రాబ్లమ్ నుండి సీత అన్నయ్యనే కాపాడుతాడని అనుకొని సీతాకాంత్ దగ్గరికి సిరి వెళ్లి.. తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |